కెనడాలో దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అండ చూసుకొని ఏకు మేకై అక్కడ ఖలిస్తాన్ సానుభూతిపరులు స్థానిక పౌరులనే బెదిరించే స్థాయికి తెగబడ్డారు. కెనడాలో ఖలిస్థాన్‌వాదులు ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెర తీశారు. ఇప్పటివరకు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన ఖలిస్థానీ మూకలు తాజాగా స్థానికులైన కెనడా వాసులనే హెచ్చరించడం ప్రారంభించారు. ని న్నటిదాకా తమ కష్టాలకు భారతదేశమే కారణమంటూ నిందిస్తూ వచ్చిన ఖలీస్థానీ ఉగ్ర వాదులు ఇప్పుడు కెనడాలో స్థానికులుగా ఎన్నో ఏళ్ళుగా స్థిరపడి జీవిస్తున్న వారిపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.
చివరకు బెదిరింపుల దాకా వచ్చారు.‘మీరంతా దురాక్రమ ణదారులు. తిరిగి ఇంగ్లాండ్, యూర ప్ దేశాలకు వెళ్లిపోండి’ అం టూ అక్కడి స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల జరిగిన నగర సంకీర్తనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ఇలాంటి హెచ్చ రికలు చేస్తూ రెండు నిమిషాలు నిడివిగల వీడియోనుకూడా విడుదల చేశారు. దీనిపై భారత నిఘా వర్గాలు స్పందిస్తూ కెనడాలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణం అ య్యాయని అభిప్రాయపడ్డాయి.
అక్కడ తగిన నిఘా లేకపోవడంతో వారు అన్ని వ్యవస్థలను అదుపు చేస్తున్నారని తెలిపాయి. ఖలిస్థాన్ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఇండియా ఏ జెంట్లు పనిచేస్తున్నారంటూ సాక్షాత్తు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించిన దగ్గర నుండి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల దౌత్య వ్యేత్తలను పరస్పరం బ హిష్కరించుకునే స్థాయి వరకు పరిస్థితి వెళ్లింది. ట్రూడో ఆరోపణలను ఖండించిన భారత ప్రభుత్వం స్వయంగా ఆయనే ఖలిస్థాన్ తీవ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని ప్రత్యారోపణలు చేసింది.
ఖలిస్తాన్ తీవ్రవాదులు భారత్ లో అల్లర్లు సృష్టించడానికి కుట్ర పన్నుతుండడంతో పాటు, కెనడాలోని హిందువుల పైన కూడా దాడులు చేస్తున్నారని తెలిపింది. స్వయంగా కెనడాలో ప్రజాదరణ కోల్పోయిన తన పార్టీ ఎంపీ జగ్మీత్ సింగ్‌ను వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో గెలిపించడానికి ట్రూడో స్వయంగా ఖలిస్థాన్ తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్‌పై బాధ్యత లేకుండా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నాయి.
ప్రతిదానికీ భారత్ నే టార్గెట్ చేస్తూ నిందిస్తూన్న ట్రూడో దేశ ప్రధానిగా హుందాగా ప్రవర్తించడం లేదు. ఐఎస్‌ఐ,ఖలిస్థాన్ వాదుల చేతిలో చిక్కుకొని ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారో ఆయన గుర్తించడం లేదని , రెండు దేశాల మధ్య ఎంతో కాలంగా ఉన్న స్నేహ సంబంధాలను ట్రూడో దెబ్బతీస్తున్నారని భారత నిఘావర్గాలు వ్యాఖ్యానించాయి. కొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖలిస్తాన్ సానుభూతిపరుల హత్యలో భారత దేశ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశానని ట్రూడో గతంలో ఒకసారి స్వయంగా చెప్పారు.
బలమైన సాక్ష్యాధారాలు లేకుండా, సరైన దర్యాప్తు జరపకుండా దశాబ్దాలుగా స్నేహ సంబంధాలున్న దేశంపై తీవ ఆరోపణలు చేయడం సబబా? ఇటీవల కెనడా పార్లమెంటు మొత్తం ఖలిస్థాన్ సానుభూతిపరులతో నిండిపోయింది. వారు ట్రూడోపై కూర్చుని స్వారీ చేస్తున్నారు.
-డా.కోలాహలం రామ్ కిశోర్