15-04-2025 12:32:34 PM
ముంబై: మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో మంగళవారం ఉదయం వేగంగా వచ్చి అదుపుతప్పిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఖమ్‌గావ్-నందుర రోడ్డులో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి నుండి మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు వెళ్తుండగా, అమ్సారీ ఫాటా వద్ద మధ్యప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ బస్సును ఒక ట్రక్కు ఢీకొట్టిందని బుల్ధానా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఖమ్‌గావ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.