దేశ రవాణాలో డ్రైవర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో 80 లక్షలకుపైగా ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. వ్యవసాయ రంగం తర్వాత మన దేశంలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న రంగం ఇదే. వీరే జీడీపీకి 6 శాతానికి పైగా దోహదం చేయడమే కాకుండా లక్షలాది మందికి జీవనోపాధిని అందిస్తున్నారు. అయి తే, ట్రక్కు డ్రైవర్లు చాలా దుర్భరమైన జీవితాల్ని గడుపుతున్నారు. వారికి ఆహారం, నిద్ర, విశ్రాం తి తీసుకోవడానికి తగు సమయం దొరకడం లేదు. డ్రైవింగ్ సమయంలో ట్రక్కే వారికి ఇల్లు. జాతీయ రహదా రుల్లో ట్రక్కు డ్రైవర్లు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించి వాళ్లకి నాణ్యమైన డ్రైవింగ్ అనుభవాన్ని, జీవితంపై భరోసాను ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది.
2022 ‘నీతి ఆయోగ్’ నివేదిక ప్రకారం, దేశంలోని సరుకులో 70 శాతం రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతున్నది. భారతీయ రహదారులపై తిరుగుతున్న ట్రక్కుల సంఖ్య 2022 లో 40 లక్షల నుండి 2050 చివరి నాటికి కోటీ 70 లక్షలకు చేరుకుంటుందని నివేదికలు చెబుతున్నాయి. 2.2 ట్రిలియన్ టన్నుల -కి.మీ.గా ఉన్న ప్రస్తుత డిమాండ్ 2050 నాటికి నాలుగు రెట్లు అంటే, 9.6 ట్రిలియన్ టన్నుల- కి.మీ.కి పెరుగుతుందని అంచనా. దేశంలో 28 లక్షల ట్రక్కులు సంవత్సరానికి పదివేల కోట్ల కి.మీ.కు పైగా ప్రయాణిస్తున్నాయి.
ఎన్నో సమస్యలు
అభివృద్ధి చెందుతున్న ఈ రంగం సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. జాతీయ రహదారుల్లో ట్రక్ డ్రైవర్లు సరుకులను తక్కువ కాలంలో సుదూర ప్రాంతానికి చేర్చాలని ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల రోజులో ఎక్కువ గంటలు డ్రైవింగ్ చేయవలసి ఉంటుంది. ఈ కారణంగా వాహన వేగాన్ని పెంచుతారు. చాలామంది డ్రైవర్లు రోజుకు 14 గంటల వరకు డ్రైవింగ్ చేస్తున్నట్లు కొన్ని నివేదికల్లో తేలింది. దీనివల్ల ప్రమాదాలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2022 వార్షిక నివేదిక ప్రకారం ఏడాదిలో మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 32.9 శాతం (1,51,997), మొత్తం మరణాలలో 35.7 శాతం (55,571) జాతీయ రహదారులపైనే జరిగాయి.
నాన్‌స్టాప్ ట్రావెల్ కారణంగా 50 శాతం ట్రక్ డ్రైవర్లు డ్రైవింగ్ సంబంధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్లకూడా తీవ్ర అనారోగ్యాలు ఎదురవుతాయి. టైం లేకపోవడం లేదా వారికి అలవాటైన భోజనం దొరకదు. సుమా రు 70 శాతం కంటే ఎక్కువమంది డ్రైవర్లు వేళకి ఆహారం తీసుకోవడం లేదు. ఇంకా ఊబకాయం, మస్క్యులోస్కెలెటల్ (ఎముకలు, కండరాలు) సమస్యలు, అధిక రక్తపోటు, నిద్రలేమి, అధిక ఒత్తిడి స్థాయిలు, డీహైడ్రేషన్ వం టివి ఎదుర్కొంటున్నారు. చాలామంది పెద్దగా చదువుకోక పోవడం, స్థానిక భాష తెలియకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదు ర్కొంటు న్నారు.
ప్రయాణం మధ్యలో ఆర్థిక స్థోమత లేక వైద్యసేవలు పొందలేక పోతున్నారు. వాహనాలు మొరాయించినా, ప్రమాదాలకు గురైనా చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుం ది. కొన్ని మార్గాల్లో దారి దోపిడీలు కూడా జరుగుతున్నాయి. దోపీడీదారులకు అడ్డు తగిలితే డ్రైవ ర్లను హతమార్చడానికీ వారు వెనుకాడడం లేదు. డ్రైవర్లు చాలాకాలం ఇంటికి దూ రం కావడం వల్ల మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు. ఇంకా అవాంఛిత లైంగిక అలవాట్ల కు లోనై, సుఖవ్యాధులు లేదా ఎయిడ్స్ బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు.
నెలవారీగా వేతనాలు ఇవ్వాలి
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు నెలవారీ జీతాలు ఉండవు. ట్రిప్‌లకు వెళ్లిన కాలానికే వేతనాలు పొందుతున్నారు. దీనివల్ల వీళ్లు కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నారు. ఈ కారణంతో యువత ఈ రంగాన్ని శాశ్వత ఉపాధి మార్గంగా ఎంచుకోడానికి వెనుకాడుతున్నారు. మన దేశంలో ట్రక్ డ్రైవర్ సగటు జీతం సంవత్సరానికి రూ. 3,14,600 (నెలకు రూ.17,040). ఇది భారతదేశంలోని జాతీయ సగటు జీతం కంటే 19 శాతం తక్కువ. సుశిక్షితులైన డ్రైవర్ల లభ్యతకూడా ఇటీవలి కాలంలో ఈ రంగాన్ని వేధిస్తున్నది. దేశంలో డ్రైవర్-- నిష్పత్తి ఇప్పటికీ 1000కి 750 కంటే తక్కువగా ఉంది. 25 నుండి 30 శాతం ట్రక్కులు కొన్ని సమయాలలో డ్రైవర్లు లేకపోవడం వల్ల ఖాళీగా ఉంటున్నాయి.
వీరికి నెలవారీ జీతం ఇచ్చేటట్టుగా యజమానులను కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి. కనీస వేతనం అమలయ్యేటట్లు చూడాలి. హైవే పెట్రోలింగ్ పెంచి దారి పొడవునా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలి. డ్రైవర్ల్ల కోసం రాత్రిపూట నిద్రించేందుకు వసతి సౌక ర్యం ఏర్పాటు చేయాలి. హైవే పక్కన ప్రతీ 400 కి.మీ.కు ప్రత్యేక ఆసుపత్రులు నెలకొల్పాలి. అందరినీ ప్రమాద బీమా పరిధిలోకి తే వాలి. ఇవన్నీ ఒకే రోజులో జరిగే పనులు కావు. ట్రక్ డ్రైవర్లకు మెరుగైన వాతావరణం కల్పించాలనే దృష్టితో 2025 సంవత్సరం నుండి నూతనంగా తయారుచేసే ఎన్2, ఎన్3 ట్రక్కు ల డ్రైవర్ కేబిన్‌లలో ఎయిర్ కండిషన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. డ్రైవర్లకు అలసట తగ్గి మరింత పని సామర్థ్యం పెరుగుతుంది. ఇటువంటి సౌకర్యా ల కల్పన పట్ల అధికారులు తమ దృష్టిని కేంద్రీకరించాలి.
డి.జె.మోహనరావు
సెల్: 8247045230