calender_icon.png 10 January, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రక్ డ్రైవర్‌పై హిజ్రాల దాడి

02-11-2024 02:18:56 AM

మధిరలో వెలుగు చూసిన ఘటన

ఖమ్మం, నవంబర్ 1 (విజయక్రాంతి): మధిరలో హిజ్రాలు రెచ్చిపోయారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని ఓ ట్రక్ డ్రైవర్‌పై దాడి చేశారు. ఈఘటన ఆదివారం మధిరలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర ప్రధాన రహదారి నుంచి ఓ ట్రక్ వాహనం వెళ్తుండగా గురువారం రాత్రి కొందరు హిజ్రాలు ఆపారు. డ్రైవర్‌ను కొంత డబ్బు అడిగారు. అందుకు డ్రైవర్ ఒప్పుకోకపోవడంతో అతడిని దూషించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం హిజ్రాలను మధిర పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఎస్సై సంధ్య వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.