calender_icon.png 22 January, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తర కన్నడలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి, 15 మందికి గాయాలు

22-01-2025 11:03:33 AM

బెంగళూరు: కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా(Uttara Kannada)లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.  కూరగాయల లోడ్ తో వెళ్తున్న ట్రక్కు, ట్రిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కనీసం 10 మంది మరణించగా, 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం యలాపురా హైవేపై(Yellapur Highway) గులాపురా గ్రామ సమీపంలో జరిగింది. తెల్లవారుజామున 4:00 గంటలకు ట్రక్కు అదుపు తప్పి ప్రమాదం జరిగింది. బాధితులంతా పండ్ల వ్యాపారులు, సావనూరు నుండి బయలుదేరి తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఎల్లాపుర జాతరకు వెళుతున్నారు. వీరు సవనూరు-హుబ్బళ్లి రహదారిపై ప్రయాణిస్తుండగా అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ పోలీసు(Uttara Kannada District Police) సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ట్రక్కు ప్రయాణిస్తున్న సమయంలో 50 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ట్రక్‌ డ్రైవర్‌ ఎడమవైపునకు వెళ్లి మరో వాహనానికి మార్గం కల్పించేందుకు ప్రయత్నించాడని, దీంతో లోయలో పడ్డానని సూపరింటెండెంట్‌ నారాయణ వివరించారు.

గాయపడిన వారందరినీ హుబ్బళ్లిలోని కర్నాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Karnataka Medical college and Research Institute Hubballi)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎల్లాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమేష్ హొన్నాపూర్ తెలిపారు. క్షతగాత్రులు సమాచారం ప్రకారం, దట్టమైన పొగమంచు(fog) కారణంగా డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించకపోవడంతో ట్రక్కు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టిందని ఇన్‌స్పెక్టర్ హొన్నాపూర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు ట్రక్కు లోడ్‌పై ప్రయాణిస్తున్నారు. మృతులందరూ హవేరి(Haveri) జిల్లాలోని సవనూర్ తాలూకాకు చెందిన వారని కూడా వర్గాలు వెల్లడించాయి.

సింధనూరులో మరో దారుణ ఘటన

కర్ణాటకలోని రాయచూర్ జిల్లా(Raichur District)లో జరిగిన మరో ఘటనలో సింధనూరు వద్ద వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. ఈ దురదృష్టకర సంఘటన తర్వాత, మృతదేహాలను వారి కుటుంబాలకు తిరిగి ఇచ్చే ముందు అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదంపై సింధనూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.