calender_icon.png 8 April, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న బెల్లంపల్లిలో టిఆర్ఎస్ సెగ్మెంట్ సమావేశం

06-04-2025 07:20:59 PM

బెల్లంపల్లి అర్బన్: బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ గ్రౌండ్ వద్ద ఈ నెల 7న బీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం తెలిపారు. ఈ నెల 7న ఏఎంసీ గ్రౌండ్ వద్ద క్వార్టర్ నంబర్ 3లో సాయంత్రం 4 గంటలకు తలపెట్టిన సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ జెడ్పిటిసిలు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఉపసర్పంచ్ లు, కౌన్సిలర్లు విద్యార్థి విభాగం నాయకులు, సోషల్ మీడియా విభాగం నాయకులు, యువజన నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.