24-04-2025 04:40:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): నష్టాల్లో ఉన్న టీజీ ఆర్టీసీని ఆదుకోవాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్, అప్పటి మంత్రులు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని టిఎంయు రాష్ట్ర అధ్యక్షులు ఏఆర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా రవాణా రంగంలో అత్యుత్తమ సేవలను అందిస్తున్న టీజీ ఆర్టీసీ పై అప్పుడే ప్రభుత్వం వివక్ష చూపి నష్టాలకు కారణమైందని ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలను అమలు చేయలేదని ప్రభుత్వంలో విలీనే ప్రక్రియ హామీగానే మిగిలిపోయిందని ప్రతినెల వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వలేని స్థితి అప్పటి పాలకులదని గుర్తు చేశారు. ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఎంయూ నిరంతరంగా పోరాడుతుందని ఆర్టీసీ సంరక్షణ కార్మికుల భద్రత సమస్యల పరిష్కారం కోసం మే నెల 7 నుంచి సమ్మె నిర్వహిస్తున్నామని దీనికి కార్మికులందరు సిద్ధంగా ఉండాలన్నారు. సమ్మెపై టిఆర్ఎస్ పార్టీ స్పందించి తమ నాయకులను పిలిపించుకోవడం ఎంతవరకు సమంజసమని తాము స్వచ్ఛందంగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.