24-03-2025 07:34:17 PM
బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలి..
రాబోయే రోజులు మనవే.. ఎమ్మెల్సీ కవిత
నిజాంసాగర్ (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బాన్సువాడ వెళుతుండగా నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి చౌరస్తా 161 జాతీయ రహదారి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీఆర్ఎస్ శ్రేణులంత కలిసికట్టుగా ఉండాలని అన్నారు. రాబోయే రోజులు మనవేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ నిజాంసాగర్ మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి ఆమెకు పుష్పగుచ్చం అందజేసి సాధారంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా సత్తా చాటుతుందని మీరంతా పార్టీ కోసం కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తున్నందుకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గైనీ విట్టల్, మనోహర్, రమేష్ గౌడ్, రమేష్, సత్యనారాయణ, బేగరి రాజు, అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గోరేమియా, సాయిలు, సుభాష్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.