calender_icon.png 9 January, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారాసిటమాల్‌తోనూ పరేషాన్

21-12-2024 02:29:20 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పారాసిటమాల్. చీటికి మాటికీ పారాసిటమాల్ వేసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కాగా ఈ టాబ్లెట్‌తోనూ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటు న్నారు. జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యల ముప్పు పెరగడానికి పారాసిట మాల్ కారణమవుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన నాటింగ్‌హామ్ యూ ని వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. 

పెద్ద వయసు లో కీళ్ల నొప్పులు తగ్గటానికీ దీన్నే  వేసుకుంటున్నారు. ఇ ది సురక్షితమని, పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండ వని అందరి భావన. కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. పారాసిటమాల్ వాడకం తో జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావమయ్యే ముప్పు 24%, పేగుల్లో రక్తస్రావమయ్యే ముప్పు 36% పెరుగుతున్నట్లు తేలింది. కిడ్నీజబ్బు (19%), హార్ట్ ఎటాక్ (9%), బీపీ(7%) వచ్చే అవకాశం ఎక్కువవుతున్నట్లు బయటపడింది.