calender_icon.png 18 January, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైబీపీతో అనర్థం

09-01-2025 12:00:00 AM

అధిక రక్తపోటు అనేది జీవనశైలి సమస్య. దీనినే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. ఎవరైనా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటే గుండె పనితీరు సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. ఒక ఇది రకమైన సైలెంట్ కిల్లర్. అయితే పగలు మాత్రమే కాకుండా రాత్రి కూడా ఈ సమస్య వేధిస్తుంది.

రాత్రి నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే అది హైబీపీకి సంబంధించిన ముందస్తు లక్షణం. నిజానికి హైబీపీతో నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. దీని కారణంగా నిద్రలేమి సమస్యలువస్తాయి. అధిక రక్తపోటు ఉన్నట్లయితే మందులు వేసుకోవాలి. మంచి నిద్ర కోసం ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఉదయం ధ్యానం చేయాలి. రాత్రిపూట అధిక మూత్రవిసర్జన సమస్య ఉంటే అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్య మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన మూత్రం అధికంగా వస్తుంది. 

రాత్రిపూట లేదా నిద్రలేచిన తర్వాత తలనొప్పి ఉంటే అది అధిక రక్తపోటుకు సంకేతం. అధిక రక్తపోటు కారణంగా వచ్చే తలనొప్పి ఉదయం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి నిద్రపోయేటప్పుడు రక్తపోటు పెరుగుతుంది. ఇది ఉదయం ఎక్కువగా ఉంటుంది.