ఎమ్మెల్యే ముఠా గోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): వరద నీటి నాల వల్ల ప్రజలకు ఎలాంటి ముంపు తలెత్తకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ డివిజన్ లోని స్ట్రీట్ నెంబర్ 17 బాప్టిస్ట్ చర్చి వీధిలో రూ. 43 లక్షలతో చేపట్టిన నాలా పూడికతీత పైకప్పు నిర్మాణ పనులను ఆయన జిహెచ్ఎంసి డి గీత కుమారి, మురళితో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నాలాలో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకు వచ్చాయని, నాలా అద్వాన స్థితికి చేరడం వల్ల నాలా మురుగు నీరు ఉప్పొంగుతూ ప్రవహిస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి 190 మీటర్ల పొడవున నాలా ను ఆధునికరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, పార్టీ నాయకులు దీన్ దయాల్ రెడ్డి, శ్రీధర్ చారి, నాగులు యాదవ్, సుధాకర్ గుప్తా, పూస గోరఖ్నాథ్, ఎయిర్టెల్ రాజు, బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.