calender_icon.png 22 March, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో బట్టుపల్లి వద్ద బోల్తా

22-03-2025 12:19:26 PM

మంథని ఆసుపత్రికి గాయపడ్డ మహిళను తరలింపు... మెరుగైన వైద్యం కోసం కరీంనగర్, వరంగల్, గోదావరిఖనికీ తరలింపు

మెరుగైన వైద్యం అందించాలి అదేశించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం  మంథని మండలంలోని బట్టుపల్లి గ్రామం నుండి 20 మంది ట్రాలీ ఆటలో రైతు  కూలీ పనికి మహిళలు వెళ్తుండగా నాగేపల్లి స్టేజ్ వద్ద ప్రమాదవశత్తు ఆటో బోల్తా పడటంతో బట్టుపల్లి గ్రామస్తులు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఫోన్ లో తెలియజేయగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు గోదావరిఖని ఏసిపి రమేష్ కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందిని పంపించి గాయపడ్డ వారిని హుటాహుటిన మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రి సూపర్డెంట్ డా. రామకృష్ణ తో మాట్లాడి  మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోరారు. కొందరికి కాళ్లు చేతులు ఫ్రాక్చర్ కాగా మెరుగైన వైద్యం కోసం కొంత మందిని గోదావరిఖని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హిమబిందు తో మంత్రి మాట్లాడి అక్కడికి పంపించారు. మంత్రి ఆదేశాల మేరకు ఏసిపి రమేష్ ఆస్పత్రిలో పర్యవేక్షిస్తూ ఎమర్జెన్సీ ఉన్నవాళ్లను మెరుగైన వైద్య సేవల కోసం ఎంజీఎం, నిమ్స్ కు తరలించారు. కండెల ఎర్రక్క కరీంనగర్ లోని అపోలో హాస్పిటల్ కి పంపించగా ఆసుపత్రి సిబ్బందితో మంత్రి మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మంథని సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందితో పాటు  కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఆరేళ్లి కిరణ్ అధ్వర్యంలో గాయపడ్డ వారిని తరలించడంలో పోలీసులకు సహకరించారు.