22-02-2025 12:00:00 AM
అల్లు అర్జున్ సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది సినీవర్గాల నుంచి. ‘పుష్ప2’తో విజయాన్నందుకున్న తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాపై వార్తలొచ్చాయి. ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఈ కాంబో ఈ సారి రొటీన్‌కు భిన్నంగా సోషియో మైథలాజికల్ ఫాంటసీ సినిమా చేయనున్నారంటూ చర్చ జరిగింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్.. కార్తికేయ అనే మహాశివుడి కుమారుడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. ఈ సినిమా గురించే నిర్మాత నాగవంశీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ప్రీ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సినిమా పక్కక పెట్టేశారని, అందుకే బన్నీ, అట్లీ సినిమాను పట్టాలెక్కించనున్నారనేది తాజాగా వినవస్తున్న టాక్. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్, అట్లీతో పనిచేస్తే మరి త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి? అని సందేహిస్తున్నారు సినీప్రియులు.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ హీరో రవితేజతో సినిమా చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్‌పై చిన్నబాబు, నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. ఇందులో కథానాయికలుగా పూజా హెగ్డే, శ్రీలీల నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.