calender_icon.png 15 January, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రివేణి సంగమం భక్తజన సంద్రం

14-01-2025 12:17:51 AM

* ఏర్పాట్లపై విదేశీ భక్తుల కితాబు

* భక్తులకు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభాకాంక్షలు

* రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2లక్షల కోట్ల ఆదాయం!

ప్రయాగ్‌రాజ్, జనవరి 13: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో ఉదయం 5.15గంటలకు తొలుత పీఠాధిపతులు, నాగ సాధువుల షాహీ(రాజ) స్నాన వేడుకతో మ హా కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ఘనంగా ప్రారంభమైన మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు.

దీంతో తీర్థరాజ్‌గా పేరొందిన ప్రయాగ్ రా జ్ జన సంద్రాన్ని తలపిస్తోంది. పుష్య పౌర్ణమికి ఉన్న విశిష్ఠత దృష్ట్యా తొలి రోజు భక్తులు పెద్ద ఎత్తన పెద్ద అమృత స్నానాలు ఆచరించారు. మొ దటి రోజు సుమారు 1.౬౫కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేశారు.

భక్తుల పూజాది కార్యక్రమాలతో తీర్థరాజ్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.  మహాకుంభ మేళా సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వే దికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మం దికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లోమహా కుంభమేళా ప్రారంభమైంది.

విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎం తో మం దిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది. పవిత్ర స్నా నాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సు లు తీసుకునేందుకు లెక్కలేనంతమంది రావడం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ ప్రధాని ట్వీట్ చేశా రు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం సోష ల్ మీడియా వేదికగా భక్తులకు శుభాకాంక్షలు చెప్పారు.  ‘గంగమ్మ మీ అందరి ఆకాం క్షలను నెరవేరుస్తుంది. మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో తొలి రోజు స్నానాలు ఆచరించిన భక్తులకు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌లో సీ ఎం పేర్కొన్నారు. అంతేకాకుండా మహాకుంభమేళాను ఆయన సనాతన ధర్మం ఆత్మగా అభివర్ణించారు. 

హృదయం వెచ్చదనంతో నిండిపోయింది

ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుం డా విదేశీ భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో తొలిరోజు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సం దర్భంగా బ్రెజిల్‌కు చెందిన ఫ్రాన్సిస్కో అనే భక్తు డు మాట్లాడుతూ ‘మోక్షం పొందేందకు ప్రయత్నిస్తున్నాను. ప్రతి రోజూ యోగా చేస్తాను. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం. నదిలో నీళ్లు చల్లగా ఉన్నప్పటికీ హృదయం మాత్రం వెచ్చదనంతో నిండిపోయింది’ అని పేర్కొన్నారు.

భారత్ చాలా గొప్పదేశమని, మొదటిసారి ఇక్కడ జరిగే కుంభమేళాలో పాల్గొంటున్నానని రష్యాకు చెందిన ఓ భక్తురాలు తెలిపారు. ‘మేరా భారత్ మహాన్. కుం భమేళాలో మనం అసలైన భారత్‌ను చూడవ చ్చు. కుంభమేళా జరిగే ప్రదేశంలో శక్తి ఉంది. నే ను భారత్‌ను ప్రేమిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.

త్రివేణి సంగమంలో స్నానం ఆచరిం చ డాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు స్పెయిన్‌కు చెం దిన భక్తుడు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్ర భుత్వం చేసిన ఏర్పాట్లను విదేశీ భక్తులు ప్రశంసించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలె త్త కుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. వీధులన్నీ శుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

పుణ్యస్నానం ఆచరించిన లారెన్ పావెల్ జాబ్స్

ఆపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్ పావెల్ జాబ్స్.. ఆధ్యాత్మికతపై ఇష్టంతో ఉత్తరప్రదేశ్‌లోని ఓ సాధువు సమక్షంలో తన పేరును కమలగా మార్చుకున్నారు. అనంత రం కాశీలోని విశ్వేశ్వరుడిని  దర్శించుకున్న ఆమె.. సోమవారం తెల్లవారుజామున  త్రివేణి సంగమంలో అమృతస్నానం ఆచరించారు. 

ఈ అక్కాచెల్లెళ్లు అస్సలు తప్పిపోరు

మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ భక్తులతో కిక్కిరిపోయింది. తొలిరోజే సుమారు రెండు కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సం దర్శించి పుణ్య స్నానాలు ఆచరించారు. అంతటి జనంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తప్పిపోయే ప్రమాదం ఉంది.

ఇది ముందుగానే గమనించిన జార్ఖండ్‌కు చెందిన గీతా, లలితా అనే అక్కాచెల్లెళ్లు జనంలో ఒకరి నుంచి మరొకరు వేరవ్వకుండా ఉండేందుకు ఓ తాడును ఇద్దరి చేతుల కు కట్టుకున్నారు. దీంతో వారి ముందు చూపును చూసి అక్కడి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తొలిరోజు జన సంద్రంలో సుమారు 250 మంది భక్తులు తమ కుంటుంబ సభ్యుల నుంచి వేరయ్యారు. అయితే అధికారులు చర్యల వల్ల వాళ్లందరూ తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 

రూ.2లక్షల కోట్ల ఆదాయం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తరలివస్తున్నారు. 45రోజులపాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తు న్నాయి.

‘మహాకుంభమేళా వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు భారీ మొత్తంలో జరుగుతాయి. ఒక్కో వ్యక్తి సగటున రూ.5వేలు ఖర్చు పెట్టినా మొత్తం రూ.2లక్షల కోట్లు అవుతుంది. హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, తాత్కాలిక నివాసాలు, నివాస ప్రాంతాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు వంటివి ఈ ఖర్చులో ఉంటాయి’ అని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండి యా ట్రేడర్స్ (సీఐఏటీ) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖాండేవాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ భక్తుల సగటు గనక రూ.10వేలకు పెరిగితే రాష్టానికి చేకూరే ఆదాయం కూడా రూ.4లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.