23-04-2025 09:16:51 AM
భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మిడియట్ ఫలితాలలో భద్రాచలం చర్ల రోడ్ నందు గల త్రివేణి జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఏం.పి.సి మెదటి సంవత్సరం లో పి.ఐశ్వర్య 466/470 సాధించి రాష్ట్ర స్థాయి మరియు డివిజన్ పరిధిలో ర్యాంకు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఏం.పి.సి విభాగం లో సి.హెచ్. కౌశిక్ 989/1000 సాధించి రాష్ట్ర మరియు డివిజన్ స్థాయి ర్యాంకు సాధించారు. మెదటి సంవత్సరంలో పి. ఐశ్వర్య ఎంపీసీలో 470/466, జి నాగసాయి యశ్వంత్ ఎంపీసీలో 470/458, కే సంధ్య బైపీసీ లో 1000 / 892 మార్కులు సాధించి త్రివేణి కాలేజీకి పేరు తెచ్చారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో సి.హెచ్. కౌశిక్ 989/1000 (ఏం.పి.సి), పి అలేఖ్య 974/1000 (ఎంపీసీ) కే సంధ్య 892/1000 (బైపిసి) తోపాటు అత్యధికంగా విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల చైర్మన్ కోడూరి సత్య నారాయణ, కళాశాల డైరక్టర్ కోడూరి. ప్రశాంతి మరియు ప్రిన్సిపాల్ టి. శ్రీకాంత్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యపక బృందం పాల్గొన్నారు.