భీమదేవరపల్లి, జనవరి 17: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరన్న సన్నిధిలో శుక్రవారం వైభవంగా త్రిశూల స్నాన ఘట్ట వేడుకలు జరి స్వామివారికి విశేషంగా అష్టభైరవ అర్చన, నిత్యపాసన, రుద్రహోమం, శక్తి హోమం, మహాపూర్ణాహుతి జరిపించారు.
ఆలయ అర్చకులు కే రాజయ్య, మొగిలిపా రాంబాబు, వినయ్‌శర్మ, డైరెక్టర్ కొంగొండ సమ్మయ్య, సీఐ పులి రమేశ్, ఎస్సై ఆధ్వర్యంలో పవిత్ర పుష్కరిణి చేరుకున్నారు. త్రికులేశ్వరుడి సహితంగా పవిత్ర స్నానాలు చేసి స్వామి వారి దివ్యమంగళ ఆశీస్సులు పొందారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరన్నను దర్శించుకుని, గుమ్మడికాయ నైవేద్యం సమర్పించుకున్నారు.