calender_icon.png 27 December, 2024 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సల్మాన్‌తో రొమాన్స్!

18-07-2024 01:26:45 AM

వయసు పెరుగుతునన కొద్దీ అవకాశాలూ పెరగటం అనేది చాలా తక్కువ మంది హీరోయిన్ల జీవితాల్లోనే జరిగింది. వయసు రీత్యా, కెరీర్ దృష్ట్యా త్రిష కృష్ణన్ సీనియర్ హీరోయిన్. తనదైన నటనతో దాదాపు స్టార్ హీరోలందరితో ఆడిపాడిన ఈ బ్యూటీకి హీరోయిన్‌గా చాన్సులు దక్కటం పరిపాటి అని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’తో త్రిషకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టయింది. అటు తర్వాత దళపతి నటించిన ‘గోట్’లో ఓ ఐటం సాంగ్‌తో అదరగొట్టనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాక ‘విడాముయర్చి’లో అజిత్ కుమార్‌కు జోడీగా నటిస్తోంది. మల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’లో మెరువనుంది. చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో జత కట్టనుంది.

మలయాళంలో మోహన్‌లాల్‌తో ‘రామ్’ చిత్రంలోనూ త్రిషనే హీరోయిన్. ఇవన్నీ కాకుండా త్రిషను మరో అవకాశం వరిచిందనేది తాజా ఖబర్. అది కూడా బాలీవుడ్ నుంచి దక్కిన బంపర్ ఆఫర్ అని చెప్తున్నారు. ఈ వార్తలో ఇంకా క్రేజ్ ఏంటంటే.. త్రిష సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయనుందనే ముచ్చట! సల్మాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ది బుల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారట. కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, తొలి షెడ్యూల్‌ను స్పెయిన్ దేశంలో నిర్వహించనున్నారని సమాచారం. త్రిష 2010లో తొలిసారి బాలీవుడ్ సినిమాలో ‘ఖట్టా మీఠా’లో అక్షయ్ కుమార్‌తో నటించింది. మళ్లీ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత త్రిష బాలీవుడ్‌లో నటిస్తుండటం అభిమానులు హర్షించదగ్గ విషయమే.