calender_icon.png 20 January, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగులో త్రిష ఐడెంటిటీ

19-01-2025 12:00:00 AM

త్రిష, టోవినో థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఐడెంటిటీ’. మలయాళంలో విడుదలైన ఈ సినిమా రెండు వారాల్లో రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచనాదర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాజు మల్లియాత్, రాయ్ సీజే నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను ఇప్పుడు శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు తెలుగులో విడుదల చేస్తున్నారు. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ, చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.