calender_icon.png 25 February, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడ్‌బ్యాడ్‌అగ్లీలో రమ్యగా త్రిష

24-02-2025 12:00:00 AM

అజిత్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చి త్రం ‘గుడ్‌బ్యాడ్‌అగ్లీ’. టాలీవుడ్‌కు చెందిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజిత్‌కు జంటగా త్రిష కృష్ణన్ నటిస్తోంది.

తా జాగా మేకర్స్ త్రిష పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. త్రిష ఇందులో ‘రమ్య’ అనే క్యారెక్టర్‌లో నటిస్తోందని ప్రకటించారు. గ్లింప్స్‌లో కనిపించినట్టే.. త్రిష పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుందట. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది.