- 92 వేల కేసులు పరిష్కరించిన జస్టిస్ అమర్‌నాథ్
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పురస్కారం
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ అరుదైన ఘనత సాధించారు. అత్యధిక కేసులు పరిష్కరించిన న్యాయమూర్తిగా రికార్డ్ సృష్టించారు. ఇందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అమర్‌నాథ్‌గౌడ్ పురస్కారాన్ని అందుకున్నారు.
2017 నుంచి ఇప్పటి వరకు జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్ 92 వేల కేసులు పరిష్కరించారు. యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ వాసి అయిన అమర్‌నాథ్‌గౌడ్ 2017లో తెలంగాణ హైకోర్ట్ న్యాయపూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన బెంచ్‌లో కేసులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరిస్తానని వెల్లడించారు