11-02-2025 12:52:03 AM
అర్మూర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా అర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలం గుత్ప అపురూప ఆలయాన్ని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలు గవర్నర్ కు స్వాగతం పలికారు.
అక్కడినుంచి బయలుదేరి ఆర్మూర్ లోని సిద్దలగుట్టను గవర్నర్ సందర్శించి పూజలు నిర్వహించారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, పుప్పాల శివరాజ్, కోటపాటి నరసింహనాయుడు, అమృతలత, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.