11-02-2025 01:00:08 AM
కామారెడ్డి , ఫిబ్రవరి 10,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్సాపూర్ గ్రామ పరిధిలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్ వద్ద సోమవారం ఉదయం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆగారు. హైదరాబాద్ నుంచి బాసర వెళ్తుండగా హోటల్ వద్ద కొద్దిసేపు ఆగి టీ తాగారు.
హోటల్ యజమాని రవీందర్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి రాజ్యలక్ష్మి గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని అడిగి నట్లు సమాచారం. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.