12-02-2025 12:10:00 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరానికి విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు కు గవర్నర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు జిల్లా ప్రముఖులు పూలమాలలతో శాలువలతో ఇంద్రసేనారెడ్డిని సన్మానించారు. అనంతరం జిల్లా కున్న తన అనుబంధాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మీనారాయణ. న్యాయం రాజు బిజెపి మండల అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు బిజెపి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో హాజరై ఇంద్రసేనారెడ్డికి స్వాగతం పలికారు.