కూకట్ పల్లి,(విజయక్రాంతి): కెపిహెచ్బి కల్చరల్, వెల్ఫేర్ స్పోర్ట్స్ అసోసియేషన్, శేరి మమతా సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పీజేఆర్ జ్ఞాపకార్థం శనివారం కేపీహెచ్బీ కాలనీలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రంగులతో అందమైన ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా ఒకటి నుంచి ఆరు వరకు ఉత్తమమైన ముగ్గులను ఎంపిక చేసి బహుమతులు ప్రధానం చేశారు. అంతేకాకుండా ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు గిఫ్ట్ బాక్స్ లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రేష్మ, లక్ష్మి, జోజమ్మ, మారుతి, తమ్మినేని ప్రవీణ్ కుమార్, సంజీవరావు, రాజేష్ గౌడ్, ఫణింద్ర కుమార్, పిడికిటి గోపాల్ చౌదరి, రాజు ముదిరాజ్, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.