calender_icon.png 19 April, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రావి నారాయణరెడ్డి కాలనీలో ముగ్గుల పోటీలు

12-04-2025 01:07:34 PM

చిలుకూరు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,134వ జయంతి సందర్భంగా చిలుకూరు గ్రామంలోని రావి నారాయణరెడ్డి కాలనీలో 13వ,తారీకు ఆదివారం ఉదయం 9 గంటలకు చిలుకూరు గ్రామం మహిళలకు గ్రామస్థాయి ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది, ఈ పోటీలలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బహుమతులు, మరియు  కన్సోలేషన్ బహుమతులు గెలుచుకోగలరని అన్నారు. అదేవిధంగా 14 వ తారీకు సోమవారం ఉదయం 9 గంటలకు చిలుకూరు బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి  10, గంటలకు ఆర్ ఎన్ ఆర్, కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి సభను నిర్వహించడం జరుగుతుంది, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేయడం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా మాల మహానాడు ఆర్ ఎన్ ఆర్ కాలనీ  కమిటీ సభ్యులు తెలియజేశారు.