calender_icon.png 21 September, 2024 | 3:12 AM

భూ దందాల కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పు

21-09-2024 12:24:23 AM

ఆలైన్‌మెంట్ మార్పుపై సీబీఐ విచారణ కోరాలె

మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్ ఆర్) ద క్షిణభాగం అలైన్‌మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆ రోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో  మీడియా సమావేశంలో మాట్లాడు తూ స్వలాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్‌మె ంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీ సుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్‌మెంట్ మారుస్తున్నారని ఆరోపించారు.

ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్‌మెంట్ మారుస్తున్నామని చెబుతున్నారని, ఫోర్త్ సి టీ,  పాత అలైన్‌మెంట్ మధ్య దూరం 10 కి లో మీటర్లు ఉంటే కొత్త అలైన్ మెంట్ మధ్య దూరం 12కిలోమీటర్లు ఉందన్నారు. దీంతో ఫోర్త్ సిటీకి ట్రిపుల్ ఆర్ దూరమైందని తెలిపారు. అమన్‌గల్ వద్ద 400 ఎకరాల కుం దారం భూములను కాంగ్రెస్ నేతలు బిగ్ బ్ర దర్స్ పేర్లు చెబుతూ జనవరి నుంచే పేదల తో కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారని ఆరోపించా రు. చరిత్రలో కబ్జా రద్దు ఒప్పందం మొదటిసారి చూస్తున్నామని చెప్పారు.

మారిన అలైన్‌మెంట్  కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోందని, మాడుగుల గ్రామం సీ ఎం బంధువులదని, అక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించారు. చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి మన్నెగూడ క్రాస్ రోడ్స్‌కు మార్చారని, మన్నెగూడ సమీపంలో కాంగ్రె స్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, నేతలకు భూములు ఉన్నాయని పేర్కొన్నారు. బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని, ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్ మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారని ఇందులో బిగ్ బ్రదర్స్ హస్తం ఉందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని పేదల మంచి పరిహారం ఇవ్వాలని కోరారు. అలైన్‌మెంట్ మార్పు వెనుక ఉన్న అంశాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వారు కోరారు. సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అని భావించాల్సి వస్తుందని వారు అన్నారు.