calender_icon.png 11 January, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

11-01-2025 07:57:01 PM

చార్మినార్,(విజయక్రాంతి): రాజ్యాధికారం ద్వారానే కులాభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు శనివారం పేర్కొన్నారు. పాతనగర మున్నూరుకాపు సంఘం(Munnuru Kapu Society) ఆధ్వర్యంలో గౌలిపుర రామచంద్ర దేవాలయం(Gowlipura Ramachandra Temple) వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.అట్టహాసంగా ముగ్గుల పోటీలు జరిగాయి.ఈ కార్యక్రమంలో పాతనగర మున్నూరుకాపుల సంక్షేమం కోసం కార్యవర్గ సభ్యరాలు, మల్లెపల్లి ఐటిఐ మాజీ ప్రిన్సిపల్ గంటా జ్యోతిరాణి, పాతనగర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తిరుపతి శివకుమార్ ,ప్రధాన కార్యదర్శి చుక్క అశోక్ కుమార్,ఉపాధ్యక్షుడు ఎం. భాస్కర్, అరె దత్తు, తదితరులు పాల్గొన్నారు.