నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల
ఆర్జీయూకేటీనీ దత్తత తీసుకున్న ఎస్పీఐటీ
భైంసా, నవంబర్ 24 (విజయక్రాంతి): ఆర్జీయూకేటీ(ట్రిపుల్ ఐటీ) విశ్వవిద్యాలయాన్ని అకడమిక్ ఎక్స్లెన్స్ కేంద్రంగా తీర్చిదిద్దుకుందామని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల విద్యార్థులతో అన్నారు. జాతీయ దత్తత దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె ఆర్జీయూకేటీనీ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సరదాగా గడిపారు. ఇక నుంచి ఆత్మహత్యలు లేని విద్యా సంస్థగా అభివృద్ధి చేసేందుకు విద్యార్థులతో పాటు ఇక్కడి అధ్యాపకులు సమష్టి కృషి అవసరమన్నారు.
విద్యార్థుల సమస్యలపై గోప్య త పాటిస్తూ ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. అలాగే విద్యార్థులకు మార్గదర్శకత్వం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జీఆర్ఈ, ఐఐఎం, ఎంబీఏలో టాపర్లు, ప్రముఖ విద్యావంతులతో స్ఫూర్తిదాయక సెమినార్లు నిర్వహిస్తామన్నారు.