08-02-2025 12:00:00 AM
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి) : నల్లగొండ జిల్లాలోని అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ బుద్ధవనం ఓ అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శుక్రవారం బుద్ధవనంలో త్రిపీఠక సద్దమ్మ సజ్జయన పఠనోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించా రు.
తెలంగాణ పర్యాటకశాఖ సహకారం తో సికింద్రాబాద్‌కు చెందిన లైఫ్ ఆఫ్ బుద్ధ దమ్మ అంతర్జాతీయ ఫౌండేషన్, మహాబోధి సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణాది లో తొలిసారిగా త్రిపీఠక పఠనోత్సవం నిర్వహించారు. దక్షిణాసియాకు చెందిన శ్రీలంక, కంబోడియా, వియత్నాం, థాయి లాండ్ తదితర దేశాలకు చెందిన 115 మంది బౌద్ధ భిక్షువులు పఠనోత్సవానికి హాజరయ్యారు.
ఉదయం బుద్ధవనం ప్రవేశ ద్వారం వద్ద వీరికి తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ధాన్యమందిరంలో బుద్ధుని ధర్మచక్ర ప్రవర్తన సూత్రం, బుద్ధ వచనాలు బౌద్ధ భిక్షువులు గానం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ బౌద్ధ భిక్షువులు ఇట్టకా మహాధర, ఆనంద బంతే, మహాబోధి బుద్ధ విహార అధ్యక్షుడు కశ్యప బంతే పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు బుద్ధుడి ప్రతిమ బహూకరిం చారు. బుద్ధవనం ఓఎస్డీ సుధాకర్ రెడ్డి ఆమెకు బుద్ధవనం ఫొటోఫ్రేమ్ అందిం చారు.
బుద్ధవనంలో గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహణపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పఠోత్సవాలను పురస్కరిం చుకొని బుద్ధవనాన్ని రంగురంగు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలం కరించారు.