నిర్మల్ (విజయక్రాంతి): పట్టణంలోని సోమవారపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలికలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. బాలికలు సంక్రాంతి పండుగ యొక్క ప్రాధాన్యత తెలుపుతూ రంగురంగుల ముగ్గులను వేసి గొప్పియ్యాలను ఏర్పాటు చేశారు. ఉత్తమ ముగ్గులను ఎంపిక చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.