calender_icon.png 6 October, 2024 | 8:01 PM

సాంకేతికతతోనే ట్రిలియన్ ఎకానమీ

06-10-2024 02:11:21 AM

జాతీయ ఆర్థికాభివృద్ధిలో కీలకం అవ్వడమే లక్ష్యం

ఏఐ గ్లోబల్ లీడర్‌గా ఎదగాలి

ఏఐ ఆధారిత సైబర్ పాలసీ అవసరం

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రాబోయే దశాబ్ద కాలంలో తెలం గాణను ట్రిలియన్ ఆర్థిక శక్తిగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సాం కేతికత సమర్థంగా వినియోగించుకుంటేనే అది సాధ్యమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

సౌత్ ఫస్ట్ సంస్థ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన దక్షిణ్ డైలాగ్స్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం టెక్నాలజీ అందరి జీవితాల్లో అంతర్భాగమైందన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవల అం దించేందుకు సాంకేతికత దోహదం చేస్తుందని చెప్పారు.

మెరుగైన ఫలితాలు సాధిం చేందుకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను విని యోగించడం శుభపరిణామమని అన్నారు. జాతీయ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు సాంకేతిక పరంగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాయని, ఈ విషయంలో స్నేహపూర్వక వాతావరణంలో ఇరుగు రాష్ట్రాలతో పోటీ పడుతామని స్పష్టం చేశారు. 

క్రమబద్ధీకరణ అవసరం 

ప్రస్తుతం అభివృద్ధికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సం బంధించి క్రమబద్ధీరణ ప్రేమ్ వర్క్ అవసరమని శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక సైబర్ సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొంటున్నామని, ఏఐ ఆధారిత సైబర్ పాలసీ తీసుకురావాల్సిన అసవరం కూడా ఉందన్నారు. సైబర్ నేరాల నివారణలో ఏఐ వాడుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

సాంకేతిక నిపుణులంద రూ క్రమబద్ధీకరణ ఫ్రేమ్ వర్క్ రూపొందించడంలో ప్రభుత్వానికి సహకరించాలని సూ చించారు. ఇప్పటికే యూరప్, సింగపూర్ దేశాల్లో ఈ క్రమబద్దీకరణ రూపకల్పనతో అద్భుతంగా రాణిస్తున్నాయని తెలిపారు. సాంకేతికతను మంచి కంటే చెడు కోసమే ఎక్కువ వాడుకుంటున్నారని, అందుకే సోషల్‌మీడియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడ్డారు. 

సాంకేతికతతోనే గ్లోబల్ లీడర్‌గా..  

సాంకేతిక అభివృద్ధికి ఇదే సరైన సమయమని మంత్రి శ్రీధర్‌బాబు అభిప్రాయ పడ్డారు. స్థానికంగా సాంకేతిక ఉత్పత్తి సాధిస్తేనే ప్రపంచానికి ఎగుమతి చేయగలమని, అప్పుడే సాంకేతికతలో గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతామని స్పష్టంచేశారు. త్వరలోనే రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం మిలియన్ జీసీసీ నైపుణ్యం ఉన్న యువత మన దగ్గర సిద్ధంగా ఉందని, ఏటా లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అందుబాటులోకి వస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో రీస్కిల్, అప్ స్కిల్ అనేవి ఎంతో ముఖ్యమని, అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని స్కిల్ క్యాపిటల్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విజన్ అని స్పష్టం చేశారు. ఏ రంగంలోనైనా నైపుణ్యమున్న యువత అవసరమైతే తెలంగాణ వైపే చూసేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 

కేంద్రమూ సహకరించాలి 

రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా స మ్మిళిత వృద్ధికి కృషి చేయాలని, నైపుణ్యాభివృద్ధి అంశంలో రాష్ట్రాలకు కేం ద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని మంత్రి కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు అవసరమున్న నేపథ్యంలో కేంద్ర సహకారం తప్పనిసరి అన్నారు. సాంకేతిక పురోగతికి, రాష్ట్రాల అవసరాలను గు ర్తించి కేంద్ర ప్రభుత్వం సహకారం అం దిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఐ ఆధారిత పరిపాలనపై అనేక సం దేహాలున్నాయని, మనుషులే నేరుగా డేటా సేకరణ చేపడుతున్నందున్న చి న్న చిన్న తప్పిదాలకు ఆస్కారం ఉం టుందన్నారు. దానికి ఏఐని కారణంగా చూపకూడదని విజ్ఞప్తి చేశారు. పరిపాలనలో జవాబుదారీతనం, ఉత్పా దకత, సమర్థతను పెంచేందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించ డంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.