15-02-2025 01:30:42 AM
రాజాపూర్ ఫిబ్రవరి 14 : పుల్వామా దాడిలో వీరా మరణం పొందిన CRPF జవాన్లను గుర్తుచేసుకుంటు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మండల కేంద్రం తోపాటు మండలం లోని అన్ని పాఠశాల పిల్లలతో 910 ఫీట్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్ ఆర్మీ జవాన్లు జాతీయ జెండాతో ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి మండలం లోని పుర విధుల గుండా దేశ భక్తి నిన్నదాలతో సాగింది. అనంతరం పాఠశాల లో దేశభక్తి పైఅవగాహన కల్పించారు. పుల్వామా సైనికులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
తిరంగా జెండాకు సహకరించిన ఆర్మీ వాళ్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్మీ యూనియన్ అధ్యక్షులు నరేందర్ ఎయిర్ ఫోర్స్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీను, సిఐ మాధవ చారి,గిరిధర్ రెడ్డి, నరసింహ, వెంకటయ్య, బాలకృష్ణ, రమేష్,ఆంజనేయులు,వెంకట్, తదితరులు పాల్గొన్నారు.