మంచిర్యాల, విజయ క్రాంతి: సీతారాం ఏచూరి మరణం ప్రజా, కార్మిక లోకానికి తీరని లోటని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ భవనం ఎదుట సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో మిగిలిన సభ్యులకంటే కమ్యూనిస్టులే బాధ్యతగా వ్యవహరిస్తారన్నారు. దేశంలోనే విద్యార్థి, యువత, ప్రజలు, కార్మికులు కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాంతమ్మ, సత్తక్క, రజిత, ఎల్లవ్వ, మల్లక్క తదితరులు పాల్గొన్నారు.