10-03-2025 04:31:44 PM
బీసీ, బిఎల్ఎఫ్ ఇతర నాయకులు..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సావిత్రమ్మ పూలే 128వ వర్ధంతిని ఘనంగా బీసీ సంఘాలు బహుజన లెఫ్ట్ పార్టీ ప్రతినిధులు నివాళులర్పించారు. జ్యోతిబాపూలే విగ్రహం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి ఫూలే విగ్రహానికి బిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు జబ్బర్ నాయక్, వడ్ల సాయి కృష్ణ పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు జబ్బర్ నాయక్ మాట్లాడుతూ... "సావిత్రమ్మ పూలే దేశంలో మొట్టమొదటి పంతులమ్మగా చదువుల తల్లిగా పేరుగాంచింది, ఆనాడు బడుగు బలహీన వర్గాలకు చదువును దూరం చేస్తున్న బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాలు చదువుకోవాలని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా "సత్యశోధక సంస్థ" ఆధ్వర్యంలో సావిత్రమ్మ పూలే, జ్యోతిరావు పూలే ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు చేసి చదువు చెప్పడం జరిగింది.
సావిత్రమ్మ పూలే స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనగారిన వర్గాలు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. సావిత్రమ్మ పూలే, జ్యోతిభ పూలే, అంబేద్కర్, కారల్ మార్క్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బిఎల్ఎఫ్ బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు గంగమని, స్వప్న, చౌక్య ప్రసాద్ లు పాల్గొన్నారు.