calender_icon.png 26 December, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరులైన అటవీ శాఖ అధికారులకు నివాళులు

11-09-2024 06:01:10 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని డివిజన్ కార్యాలయం ఆవరణలో విధినిర్వహణలో అమరులైన అటవీశాఖ అధికారులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ... విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి భాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ అమరులైన సిబ్బంది సేవలు మరువలేనివని కొనియాడారు. తదనంతరం డివిజన్ కార్యాలయం నుండి ప్రధాన రహదారుల గుండా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  చెన్నూరు, నీల్వాయి, కోటపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అప్పలకొండ, సదానందం, డిప్యూటీ ఆర్ఓలు ప్రభాకర్, ప్రమోద్, లావణ్య సిబ్బంది పాల్గొన్నారు.