calender_icon.png 2 March, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం

01-03-2025 08:52:43 PM

మునగాల: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మునగాల మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ అధ్యక్షతన అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్  ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కొత్తపల్లి అంజయ్య మాదిగ, పాతకోట్ల నాగరాజు మాదిగ పాల్గొని అమరవీరుల చిత్ర పటాలకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా దండోరా ఉద్యమం ద్వారా ఎస్పీ వర్గీకరణ కోసంగత ప్రభుత్వాలను ముచ్చెమటలు పట్టించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక మంది ప్రాణ త్యాగంచేశారు. వారిత్యాగాల ఫలితమే ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం రాబోతుంది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మునగాల మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీమండల ఉపాధ్యక్షులు మొలుగూరి వెంకటేశ్వర్లు, బరాఖాత్ గూడెం గ్రామశాఖ అధ్యక్షుడు గుడిపాటి పెద్ద కనకయ్య మాదిగ, సీతానగరం గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరి వెంకటేశ్వర్లు, ఆకుపాముల గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపాక వీరబాబు, రేపాల గ్రామ శాఖ అధ్యక్షులు మేరీగ వెంకటేశ్వర్లు, గంట బాబు, లంజపల్లి వినయ్ కుమార్, సిర్రా గణేష్, దావీదు, వివిధగ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొని మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు,