calender_icon.png 30 April, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింగిళి కళాశాలలో పహల్గాం మృతులకు అశ్రునివాళి

29-04-2025 06:50:20 PM

ప్రిన్సిపాల్ లెఫ్ట్నెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి...

హనుమకొండ (విజయక్రాంతి): పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) హనుమకొండ, పహల్గామ్ లో ఉగ్రవాద దాడిలో మరణించిన భారత పర్యాటకులకు ఆశ్రునివావాళి అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కళాశాల ఎన్ సి సి విభాగం ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లెఫ్ట్ నెన్ట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి మాట్లాడుతూ... ఇటీవల కాశ్మీర్ లోని పాహెల్గాంలో అమాయకులైన 28 మంది భారత పర్యాటకులను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చడం హేయమైన చర్య అని, పాశవిక మైందని దీనిని ముక్తకఠంతో ఖండిస్తూ మృతులకు నివాళి అర్పిస్తున్నామనీ, మృతుల కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామనీ అన్నారు.

ఈ సంఘటనను ఖండిస్తూ కళాశాల అధ్యాపకులు రేణుక, రత్నమాల, ఎన్ సి సి క్యాడెట్లు దీక్షిత, వెంకటలక్ష్మి, కృష్ణవేణి ఈ పాశవికమైన చర్యను ఖండిస్తూ, నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్  డా.జి.సుహాసిని, ఎన్ సి సి కేర్ టేకర్ డా. బి.సువర్ణ , ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ డా.సురేశ్ బాబు, అధ్యాపకులు సుజాత, మధు, ప్రవీన్ కుమార్, రాజేశ్వరి, సునీత, రాంరెడ్డి, రమేష్, బోధన, బోధనేతర సిబ్బంది, ఎన్ సి సి కాడెట్లు, కళాశాల  విద్యార్థులు పాల్గొన్నారు.