calender_icon.png 25 April, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐవిఓ ఆధ్వర్యంలో ఉగ్రదాడి అమరులకు నివాళులు

24-04-2025 10:31:52 PM

పహల్గాంలో ఉగ్రదాడి అమానుషం..

కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి..

కోదాడ: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (ఐవివో) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ తీసి అమరులైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం అన్నారు.

దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, పిఆర్ఓ ఎస్ రమేష్, పాట్రన్స్ గుండపునేని నాగేశ్వరరావు, జగనీ ప్రసాద్, సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ కె వెంకన్న, రహీం, గుండెపంగు రమేష్, హిందువులు, ముస్లిం సోదరులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.