01-03-2025 12:54:17 AM
ఖమ్మం, ఫిబ్రవరి 28( విజయక్రాంతి ): ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు.
విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనం దంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ ప్రసాద్ రావు, అడిషనల్ డీసీపీ (ఏ ఆర్ ) కుమారస్వామి,ఏ ఆర్ ఏసీపీ నర్సయ్య, సుశీల్ సింగ్, ఆర్ ఐ అప్పలనాయుడు, పోలీస్ అసోసియేషన్ రాష్ట్రఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, మోహన్ రావు, పంతులు పాల్గొన్నారు.