మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని,(విజయక్రాంతి): క్రాంతి ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రం(Independence) సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు జాతిపిత గాంధీజీ అని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kottha Srinivas) అన్నారు. ఐటి, పరిశ్రమలు, మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆదేశాల మేరకు గురువారం మంథనిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ జీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్బంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... సత్యం, అహింస గాంధీ నమ్మే సిద్దాంత మూలాలని, అన్యాయాలకు సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అతని ఆయుధాలని కొనియాడారు. ఒక్క రక్తపు బొట్టు చిందకుండా శాంతియుతంగా స్వాతంత్య్రం తీసుకువచ్చిన ఘనత గాంధీజీది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంథని శ్రీనివాస్, మంథని పట్టణానికి చెందిన వైశ్య పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.