గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించిన డాక్టర్ రాజా రమేష్ బాబు
మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో అధికారం చేపట్టి 420 రోజులు గడిచినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ నాయకులు మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ 77వ వర్ధంతిని పరిష్కరించుకొని 420 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరు పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) 420 హామీలను 6 గ్యారంటీ లను అమలు చెయ్యడం చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ముందు కళ్ళబొల్లి మాటలు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపించి సబ్బండా వర్గాలకు అన్యాయం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 420 రోజులు దాటిన రైతులకు రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వకుండా విషయాన్నీ దాటెసే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిన ప్పటికీ ఇంకా పాలన మీద అవగాహన లేకుండా అసమర్ధతతో పాలన సాగిస్తు న్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.