01-03-2025 05:32:47 PM
చివ్వేంల: మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకొని శనివారం మండల కేంద్రంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొంగల సతీష్(MRPS Mandal President Kongala Satish) మాట్లాడుతూ.... మాదిగల అభివృద్ధి కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకొని జాతి కోసం వారు చేసిన త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. అనంతరం వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి మోలుగురి సునీల్ మాదిగ మండల ఉపాధ్యక్షులు భాషపంగు బుచ్చిబాబు మాదిగ ప్రచార కార్యదర్శి బొల్లి కొండ గోపిచంద్ మాదిగ సీనియర్ నాయకులు అమ్మయ్య, దాసు,ఎమ్మార్పీఎస్ నాయకులు నవీన్, వీరన్న, లక్ష్మణ్, వెంకన్న, లింగయ్య, వరుణ్, చిన్న అమ్మయ్య, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.