22-03-2025 06:27:07 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): నేటి సమాజంలో స్వార్థ రాజకీయాలకు యువతను వాడుకుంటున్నారని యువతకు ఉపాధి కల్పించి దేశ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన పాలకులు వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, నేటి యువత అమరులైన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు లను స్ఫూర్తిగా తీసుకోని రాజకీయాల్లో నిస్వార్థంగా ప్రజాసేవా చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి పిలుపునిచ్చారు. భగత్ సింగ్ సందేశ్ యాత్ర లో భాగంగా ఇల్లందు మండలం సుందరయ్య నగర్ లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశానికి వెన్నెముక లాంటి వారు యువత అని అటువంటి యువత ను సరైన మార్గం లో నడిపించాల్సింది పోయి రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల స్నేహం దేశానికి ఆదర్శం అని అటువంటి స్నేహం ను దేశ యువత పెంపోండీంచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్నెం మోహన్ రరావు, శాఖ కార్యదర్శి కొడెం బోస్, అబ్బాస్, సోమ కృష్ణ, విజయ్ మోహన్ సింగ్, వజ్జ సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.