కామారెడ్డి,(విజయక్రాంతి): వాజ్‌పాయ్ దేశంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక అభివృద్దికి ఎంతో తోడ్పాటు అందించాయని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బిజెపి జిల్లా కార్యాలయంలో వాజ్‌పాయ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహరి వాజ్‌పేయ్ భారతదేశ 21వ శతాబ్దానికి రూపశిల్పి అని కొనియాడారు. కాంగ్రెస్ అధిపత్యం పతనానికి ప్రత్యామ్నాయంగా నాయకత్వం వహించడం బిజెపికి ఆయన చేసిన సహకారం పునాది అని అన్నారు.1998లో వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ప్రమాణాస్వీకారం చేసినప్పుడు 9 ఏళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలతో దేశ రాజకీయ ఆస్తిరతను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.బిజెపికి ఆయన చేసిన సహకారం మరవలేదనిదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.