25-04-2025 11:50:37 PM
బెల్లంపల్లిలో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ...
బెల్లంపల్లి అర్బన్: జమ్ము కాశ్మీర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన టూరిస్టులకు సంతాప సూచకంగా బెల్లంపల్లి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా కాంట అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు చేసిన నినాదాలు మార్కెట్ ప్రధాన వీధుల్లో మార్మోగాయి.
కాంట అంబేద్కర్ చౌరస్తా వద్ద మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరీ సూరిబాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నయీమ్, బండి రామ్, మేకల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు రోడ్డశారద, సరోజ, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.