29-04-2025 12:49:05 AM
గూడూరు ఏప్రిల్ 28: (విజయ క్రాంతి): ఎంసీపీయూ పార్టీ నాయకత్వంలో పనిచేసి ప్రజా ఉద్యమాలలో పాల్గొని వివిధ కార ణాల చేత అమరులైన వారిని స్మరించు కుంటూ వారికి ఈ నెల 24 నుండి 30 వరకు జరిగే అమరుల సంస్మరణ వారోత్స వాలలో భాగంగా సిపిఐ న్యూ పార్టీ మహ బూబాద్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచ వెంకన్న నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎం సిపిఐ పార్టీ నాయకత్వంలో పనిచేస్తూ ప్రజా ఉద్యమాలలో పాల్గొని వివిధ కారణాల చేత అమరులైన వారిని స్మరించుకుంటూ అమరవీరులు అమరజీవుల వారోత్సవాలు జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు గూడూరు మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటంలో పాల్గొని అమరులైనటువంటి గూడూరు మండలానికి చెందిన అమర జీవులు కామ్రేడ్ పెసరి సంజీవ,( గూడూర్ )కామ్రేడ్ జోగా చంద్రయ్య( శెట్టి) జోగ రంగమ్మ (మట్టేవాడ )జల్లి వెంకన్న (మచ్చర్ల) ఎస్ కే యాకూబ్ జానీ (పొనుగోడు) కిషన్ నాయక్ (గుండెంగా) తదితరులు ఈ మండలంలో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్న క్రమంలో అనారోగ్యం వలన మరణించడం జరిగిందని వారి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అమరవీరులు అమరజీవుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్మించి సమసమాజ స్థాపన కోసం పాటుపడాలని అప్పుడే అమరవీరులు అమర జీవుల ఆశయాల ను నెరవేర్చిన వాళ్లమవుతామని పార్టీ కార్యకర్తలకు సానుభూతిపరులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నూకల ఉపేందర్, మండల కార్యదర్శి బంధాల వీరస్వామి, నాయకులు కటకం బుచ్చిరామయ్య, దారావత్ రమేష్, బండారి సత్యం ,కిషన్ ,తదితరులు పాల్గొన్నారు.