calender_icon.png 29 December, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత హాకీ జట్టుకు సన్మానం

09-11-2024 01:23:42 AM

ముస్కట్: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) ఘనంగా సన్మానించింది. ఒమన్ వేదికగా శుక్రవారం ఎఫ్‌ఐహెచ్ ఆధ్వర్యంలో గ్లోబల్ గవర్నింగ్ బాడీ సమావేశం జరింగింది. హాకీ ఫెడరేషన్ చీఫ్ ఇసాబెల్లె జుయిన్ ధన్యవాద తీర్మానం తెలిపారు.

అనంతరం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన జట్లను ప్రత్యేకంగా అభినందించారు. భారత్ తరఫున హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ ఎఫ్‌ఐహెచ్ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు. భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సహా మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ వేదికపైకి వచ్చి భోలానాథ్‌తో కలిసి అవార్డును అందుకున్నారు. గత ఆగస్టులో జరిగిన ఒలింపిక్స్‌లో సెమీస్‌లో ఓడిన భారత జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2 చిత్తు చేసి వరుసగా రెండో పతకాన్ని ఒడిసిపట్టింది.