calender_icon.png 19 March, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతి పంపుకు సన్మానం

19-03-2025 02:33:59 AM

30 ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తున్న బోరింగ్...

ఆదిలాబాద్, మార్చ్ 18 (విజయ క్రాంతి) : వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలో నీటి కటకట ఉన్న ప్రాంతాలే ఎక్కువ. అలాంటిది నీటి ఇబ్బంది లేకుండా చేస్తున్న చేతి పంపు కు (బొరింగ్) కు స్థానికులు సన్మానం చేశారు. ఇదేంటి సన్మానం చేసేది మనుషులకు కదా.. చేతిపంపుకు చేయడమేంటి అనుకుంటున్నారా...

సహా యం చేసే మనిషికి సన్మానాలు చేసి కృతజ్ఞతలు ఎలా తీర్చుకుంటామో... గత 30 ఏళ్లుగా తమ దాహార్తి తీరుస్తున్న చేతిపంపు కు కృతజ్ఞతగా సన్మానం చేశారు.  బోథ్ మండల కేంద్రంలోని మైసమ్మ కాలనీ వాసులు తమ కాలనీలోని చేతి పంపు కు మంగళవారం పూలమాలలు వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. 1995 సంవత్సరంలో కాలనీలో నీటి సమస్యని గుర్తించిన అప్పటి ప్రభుత్వం బొరింగ్ ను వేయించింది.

నీటి సమస్యతో పలు కాలనీలు, గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తమ కాలనీ బోరింగ్ మాత్రం తమకు 30 ఏళ్లుగా కాలనీ తో పాటు చుట్టుపక్కల ప్రజల దాహార్తిని తిరుస్తున్న బోరింగ్ కు ప్రత్యేక పూజలు చేసి, సన్మానం చేశామని కాలనీ వాసులు తెలిపారు. అంజన్న, రాము, రమేష్, బాల్గం నవీన్, కొప్పుల భోజన్న, శేఖర్ తదితరులు ఉన్నారు.