calender_icon.png 28 December, 2024 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక సంస్కర్తకు ఆశ్రునివాళి

28-12-2024 02:44:26 AM

  • మన్మోహన్ మృతికి సంతాపం తెలిపిన ప్రజలు
  • ప్రధాని ఆయన దేశానికి చేసిన సేవల మననం 

విజయక్రాంతి నెట్‌వర్క్, డిసెంబర్ 27: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణలశీలి మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం మన్మోహన్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లా డుతూ.. ఆయన మాట్లాడుతూ మన్మోహన్ ఆర్థిక సంస్కరణలకు అద్యుడని, మితభాషి, మేధావి, అజాత శత్రువుని కొనియాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రం లో ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, బిచ్కుం ద మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాం తారావు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ఆలీ మన్మోహన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళి అర్పించారు.

భారతదేశంలో అత్యంత గౌరవనీయులైన నేతల్లో ఆయన ఒకరు అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుగా ప్రధానమంత్రిగా ఆయన పాత్ర మరు వలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజు, జిల్లా గ్రంథా లయ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజాయతీ, నిబద్ధతకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిలువటద్దమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఆదిలాబాద్ లోని ప్రజా సేవాభవన్‌లో సంతాప సభ ఏర్పాటు చేశారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఆర్థికమంత్రిగా తనదైన శైలిలో పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి పూడ్చలేని లోటని పేర్కొన్నారు.

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ముల్కనూరులో కాంగ్రెస్ శ్రేణులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. కామారెడ్డిలో రాజా బహుదూర్ వెంకట్రాంరెడ్డి ట్రస్ట్ అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో  నివాళి అర్పించారు.