calender_icon.png 28 April, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స అందించిన వైద్యునికి సన్మానం

23-04-2025 06:56:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పిట్టలగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ పరుశుభాయికి మెరుగైన వైద్యాన్ని తక్కువ ఖర్చుకి అందించిన నిర్మల్ తిరుమల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డిని బుధవారం సన్మానం చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురై అదిలాబాదులో డ్రీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడగా ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో హైదరాబాద్కు తీసుకెళ్లాలని అక్కడ డాక్టర్లు తెలుపగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్మల్ వైద్యులు రమేష్ రెడ్డిని సంప్రదించడంతో ఆయన ఆమెకు మెరుగైన వైద్యాన్ని అందించి మానవతను చాటుకున్నట్టు ఆదివాసి గిరిజన సంఘ నేతలు తెలిపారు. వైద్యునికి సన్మానం చేశారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.